October 2, 2022

TELUGU

 • మునుగోడు బై పోల్ ముహూర్తం ఫిక్స్ – కొత్త వ్యూహాలతో రంజుగా..!!
  on October 2, 2022 at 3:02 am

  తెలంగాణలో ఉత్కంఠ పెంచుతున్న మునుగోడు బై పోల్ కు రంగం సిద్దం అవుతోంది. మరో పది రోజుల్లో ఉప ఎన్నిక షెడ్యూల్ రానుందని ప్రధాన పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు. గుజరాత్ – హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి మరో వారంలోగానే షెడ్యూల్ రానున్నట్లు ఢిల్లీ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం సాగుతోంది. ఇదే సమయంలో మునుగోడు

 • ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు భారీగా పెరిగిన జీతాలు..!!
  on October 2, 2022 at 2:34 am

  అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం దసర పండగ కానుకను ప్రకటించింది. వేలాదిమంది ఉద్యోగుల కలను సాకారం చేసింది. ఇవ్వాళ్టి నుంచి ఆర్టీసీ కార్మికులు..అధికారికంగా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వారికి పీఆర్సీ అమలు కానుంది. పీఆర్సీ కలిపిన కొత్త జీతాలను వారు అందుకోబోతోన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. ప్రమోషన్

 • భారత్‌ మాదిరిగానే బ్రెజిల్‌లోనూ ఈవీఎంలపై ఆరోపణలు… అక్కడి ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టం ఎంత వరకు సురక్షితం
  on October 2, 2022 at 2:27 am

  ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ల మీద భారత్‌లో ఎంతో కాలంగా వివాదం నడుస్తోంది. ఈవీఎం మెషిన్లను ట్యాంపర్ చేయొచ్చని ఆరోపించే పార్టీలు చాలానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, 2019 ఎన్నికల సందర్భంగా ఈవీఎంల విశ్వసనీయతను ప్రశ్నించారు. తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ, 2018 ఎన్నికల్లో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆరోపించింది. ఇప్పుడు

 • కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఆయనేనా – తెర వెనుక..!!
  on October 2, 2022 at 2:24 am

  కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు ఎవరో క్లారిటీ వచ్చేస్తోంది. ఊహించని ట్విస్టుల నడుమ కాంగ్రెస్ అధ్యక్ష నామినేషన్ల ఘట్టం ముగిసింది. కాంగ్రెస్ హైకమాండ్ తెర వెనుక తమ విధేయుడికి పట్టం కట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. తొలి నుంచి రేసులో ప్రముఖంగా నిలిచిన గెహ్లాట్ రాజస్థాన్ లో చోటు చేసుకున్న పరిణామాలతో తప్పుకున్నారు. ఆ తరువాత దిగ్విజయ్ నామినేషన్

 • మ్యాచ్ చూస్తూ కొట్టుకున్న ఫ్యాన్స్ – 127 మందికి పైగా దుర్మరణం..!!
  on October 2, 2022 at 1:45 am

  జకర్తా: ఇండోనేసియా దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ముగిసిన తరువాత అభిమానుల మధ్య చోటు చేసుకున్న వివాదం.. పరస్పర దాడులకు దారి తీసింది. ఘర్షణ పడ్డారు. ఒకరినొకరు ప్రాణాలు పోయేంతలా కొట్టుకున్నారు. ఈ ఘటనలో 127 మందికి పైగా దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ ఘర్షణ తరువాత చోటు చేసుకున్న తొక్కిసలాటలో కూడా చాలామంది గాయాలపాలయ్యారు. కొస ప్రాణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

 • ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ ఆహ్వానం : నేడు కీలక భేటీ – క్లారిటీ..!!
  on October 2, 2022 at 1:40 am

  ప్రగతి భవన్ వేదికగా నేడు కీలక సమావేశం జరగనుంది. తన మంత్రివర్గంలోని మంత్రులతో పాటుగా 33 జిల్లాల పార్టీ అధ్యక్షులను ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌కు ఆహ్వానించారు. జాతీయ పార్టీ ఏర్పాటుపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన అంశాన్ని పార్టీలోని కీలక నేతలకు తొలిసారి చెప్పేందుకు సీఎం కేసీఆర్‌ సన్నద్ధమయ్యారు. విజయ దశమి

 • యూపీలో ఘోర ప్రమాదం, ట్రాక్టర్ బోల్తా..27 మంది మృతి, ప్రధాని మోడీ సంతాపం
  on October 1, 2022 at 5:41 pm

  ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాన్పూర్‌లో ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో 27 మంది చనిపోయారు. వీరిలో 11 మంది చిన్నారులు, 11 మంది మహిళలు ఉన్నారు. ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడటంతో ప్రమాదం జరిగింది. మరో 30 మంది వరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఫతేపూర్ నుంచి ఘాటమ్‌పూర్‌కు యాత్రికులు వెళుతున్నారు. చంద్రికా దేవి

 • Brahmotsavams: గురుడ వాహనంపై శ్రీమలయప్ప స్వామి, లక్షలాది మంది భక్తులు, గోవిందా !
  on October 1, 2022 at 2:53 pm

  తిరుమల/తిరుపతి: శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ‌నివారం రాత్రి శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారు త‌న‌కెంతో ప్రీతిపాత్ర‌మైన గ‌రుడ వాహ‌నంపై భ‌క్త‌కోటికి ద‌ర్శ‌న‌మిచ్చారు. ఏనుగులు, అశ్వాలు ఠీవిగా ముందు వెళుతుండ‌గా భక్తుల కోలాటాలు, డ్రమ్స్‌ వాయిద్యాలు, ఇతర కళాప్రదర్శనల నడుమ వాహ‌న‌సేవ కోలాహ‌లంగా సాగింది. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో ఐదో రోజైన

 • కీలక మలుపు తిరిగిన మంత్రుల మాటల యుద్ధం? బీజేపీకి B టీమ్
  on October 1, 2022 at 1:53 pm

  తెలంగాణ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలతో మొదలైన ఏపీ, తెలంగాణ మంత్రుల మాటల యుద్ధం కీలక మలుపు తిరిగింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం చర్చనీయాంశమైంది. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఏపీ మంత్రులు బొత్స, అమర్నాథ్ తోపాటు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు మంత్రి గంగుల కమలాకర్ బదులిచ్చారు. కరీంనగర్

 • మార్పు కావాలంటే నాకే ఓటేయండి.. శశిథరూర్ రిక్వెస్ట్
  on October 1, 2022 at 1:22 pm

  కాంగ్రెస్ అధ్యక్ష పదవీ రేసులో శశిథరూర్‌తోపాటు మల్లికార్జున ఖర్గే ఉన్నారు. గెహ్లట్ తప్పుకోవడంతో ఖర్గే, దిగ్విజయ్ లైన్‌లోకి వచ్చారు. అయితే గాంధీయేతరులు పదవీ చేపట్టనుండటంతో.. ఎవరు అధ్యక్ష పదవీ చేపడతారననే అంశంపై ఉత్కంఠ నెలకొంది. గెహ్లట్ అయితే గాంధీ కుటుంబానికి వీర విధేయుడిగా ఉండేవారు. కానీ రాజస్థాన్ సంక్షోభం నేపథ్యంలో ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు థరూర్,

 • చింతకాయల విజయ్ కు నోటీసులు అందుకే-సీఐడీ ప్రకటన- వైఎస్ భారతిపై ఫేక్ ప్రచారం..
  on October 1, 2022 at 1:07 pm

  ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ పొలిటికల్ వార్ లో ఇవాళ మరో వివాదం బయటపడింది. టీడీపీ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ హైదరాబాద్ నివాసానికి వెళ్లిన ఏపీ సీఐడీ పోలీసులు ఆయనకు 41ఏ సెక్షన్ కింద నోటీసులు జారీ చేశారు. విచారణకు రావాలని కోరారు. అయితే ఇంత సడన్ గా విజయ్ ను సీఐడీ

 • వివేకా హత్య కేసులో Dr.సునీతారెడ్డి నెక్స్ట్ స్టెప్ అదే?
  on October 1, 2022 at 1:03 pm

  ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిత్యం చర్చకు వస్తున్న అంశం వైఎస్ వివేకానందరెడ్డి హత్య. వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి గట్టిగా పోరాటం చేస్తుండటంతో నిందితులకు క్లిష్ట పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఆమె కేసును సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేసి గెలుపు దక్కించుకున్నారు. తర్వాత ఈ కేసు విచారణ ముందుకు సాగడంలేదని, నిందితులు సహకరించకపోవడంతోపాటు సాక్షులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని సునీత ఆరోపిస్తున్నారు.

 • మోదీ హస్తవాసి: అలా పేరు పెట్టారు..ఇలా గర్భం దాల్చింది..!!
  on October 1, 2022 at 12:41 pm

  భోపాల్: కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటూ వచ్చిన హాట్ టాపిక్.. ఆఫ్రికన్ చీతాస్. ఇప్పుడు మళ్లీ వార్తల్లోకెక్కాయి. నమీబియా నుంచి తీసుకొచ్చిన ఎనిమిది చీతాలు.. ఇప్పుడు తొమ్మిది కాబోతోన్నాయి. వాటిల్లో ఒకటి గర్భం దాల్చినట్లు మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు. గర్భం దాల్చిన సంకేతాలు ఆ చీతాలో కనిపిస్తోన్నాయని పేర్కొన్నారు. ఆ చీతాను

 • గ్రహణం మొర్రి అంటే ఏంటి? గ్రహణాలకూ, చిన్నారుల పెదవి చీలిపోవడానికి సంబంధం ఉందా?
  on October 1, 2022 at 12:40 pm

  తిరుపతి జిల్లా కేంద్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్వంలో నడిచే బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ, రీసర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (BIIRD) ఆసుపత్రిలో సెప్టెంబరు 13 నుంచి గ్రహణం మొర్రి ఆపరేషన్లు (CleftLip and Cleft Palate surgery) ఉచితంగా చేస్తున్నారు. బెంగ‌ళూరుకు చెందిన వైద్యులు డాక్ట‌ర్ కృష్ణ‌మూర్తి,

 • Actress: హోటల్ లో రూమ్ తీసుకున్న నటి, రాత్రి అక్కడే ?, రూమ్ లో శవమైన నటి !
  on October 1, 2022 at 12:11 pm

  ముంబాయి/పూణే: మోడల్ గా గుర్తింపు తెచ్చుకున్న యువతి తరువాత సినిమాల్లో చాన్స్ కోసం ప్రయత్నించింది. కమర్షియల్ యాడ్స్ లో నటించిన మోడల్ చాలా తక్కువ సమయంలో సినిమా చాన్స్ లు దక్కించుకుంది. సినిమాల్లో నటిస్తున్న ఆమెకు సినిమా అవకాశాలు క్యూకట్టాయి. హోటల్ కు వెళ్లి రూమ్ తీసుకున్న నటి రాత్రి ఫుడ్ ఆర్డర్ చేసింది. ఫుడ్ తీసుకెళ్లిన

 • వచ్చే డిసెంబర్ నాటికి దేశవ్యాప్తంగా 5జీ సేవలు: ముఖేశ్ అంబానీ
  on October 1, 2022 at 11:40 am

  5జీ సేవలను ప్రధాని మోడీ లాంచ్ చేశారు. మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమంలో ఆవిష్కరించారు. అదే వేదిక నుంచి రిలయన్స్ ఇండస్ట్రీస్ చీఫ్ ముఖేశ్ అంబానీ కీలక ప్రకటన చేశారు. దేశంలో గడప గడపకు 5జీ సేవలను అందిస్తామని పేర్కొన్నారు. మారుమూల ప్రాంతాలకు కూడా మెరుగైన నెట్ వర్క్ అందిస్తామని వివరించారు.

 • తెలుగుదేశం పార్టీ కొత్త ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌?
  on October 1, 2022 at 11:11 am

  వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకొని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావ‌డానికి తీవ్రంగా శ్ర‌మిస్తోంది. పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న నారా లోకేష్ పాద‌యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. న‌వంబ‌రులో ప్రారంభించాల‌ని పార్టీ అనుకున్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్ర‌భుత్వం ముంద‌స్తును కొంత వాయిదా వేయ‌డంతో టీడీపీ కూడా లోకేష్ పాద‌యాత్ర‌ను జ‌న‌వ‌రికి వాయిదా వేసింది. జ‌న‌వ‌రి 26వ

 • TDP Twitter Account : టీడీపీ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్- వైసీపీ పనేనంటూ ఆరోపణలు ?
  on October 1, 2022 at 11:08 am

  టీడీపీ ట్విట్టర్ ఖాతా ఇవాళ హ్యాక్ అయింది. కొందరు హ్యాకర్లు టీడీపీ ఖాతాను హ్యాక్ చేసి మరో పేరు పెట్టేశారు. టైలర్ హాబ్స్ పేరుతో టీడీపీ ట్విట్టర్ ఖాతాను మార్చేశారు. ఖాతా పేరు కింద మాత్రం ఐటీడీపీ పేరును అలాగే ఉంచారు. దీంతో ఈ వ్యవహారం ఏపీలో ఆసక్తి రేపుతోంది. టీడీపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ను

 • Girlfriend: దుబాయ్ రిటన్, గూబ పగలగొట్టి బూతులు తిట్టిన ప్రియురాలు, అన్నంతపని చేశాడు !
  on October 1, 2022 at 10:48 am

  లూథియానా/ పంజాబ్: యువకుడు, ఓ మహిళ ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ శారీరక సంబంధం పెట్టుకున్నారని సమాచారం. ప్రియుడికి దుబాయ్ లో ఉద్యోగం వచ్చింది. దుబాయ్ కి వెళ్లిన ప్రియుడు అక్కడ డబ్బులు సంపాధిస్తూ అతని కుటుంబ సభ్యులతో పాటు అతని ప్రియురాలికి పంపించాడు. యువకుడు అతని ప్రియురాలికి డబ్బు పంపిస్తున్న విషయం అతని కుటుంబ సభ్యులకు

 • తెలంగాణను నిందిస్తే ఏపి ప్రజలు హర్షిస్తారా.?వైసీపీ నాయకులపై ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ఆగ్రహం.!
  on October 1, 2022 at 10:41 am

  హైదరాబాద్ : విద్యుత్ అంశం రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదాన్ని రగిలిస్తోంది. విద్యుత్ అంశపై స్పందిస్తున్న నాయకులు ఒకరిఒకరు షాకులు ఇచ్చుకుంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల నేతల మద్య షార్ట్ సర్క్యూట్ తగిలి మంటలు రాజేస్తున్నాయి. ఫిట్ మెంట్ అంశంతో పాటు విద్యుత్ విషయంలో మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు వక్రభాష్యం

 • ప్రశాంత్ కిశోర్ ఫాలోస్ జగన్ – మద్దతు ప్రకటించిన ఆ ఎమ్మెల్సీ
  on October 1, 2022 at 10:37 am

  పాట్నా: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఏపీలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనుక ఉండి నడిపించిన ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నారు. వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకుని రావడానికి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడానికి ఉపయోగపడిన ప్రణాళికలను తాను స్వయంగా అమలు చేయబోతోన్నారు. మీ పథకాలేవీ

 • విశాఖపట్నంలో ‘క్రిమినల్ గ్యాంగ్‌లు’: వాట్సాప్ గ్రూపు ద్వారా సెటిల్‌మెంట్లు, ‘మర్డర్ చేసి సొంతూరు వెళ్లిపోతున్నారు’
  on October 1, 2022 at 10:32 am

  హైపర్ బాయ్స్, దండుపాళ్యం, త్రీస్టార్ గ్యాంగ్, ఖాసీం గ్యాంగ్, చిట్టిమామూ గ్యాంగ్.. సినిమా టైటిళ్లకు సరిగ్గా సరిపోయేలా కనిపిస్తున్న ఈ పేర్లన్ని విశాఖ నగరంలోని క్రిమినల్ గ్యాంగ్స్ పేర్లు. కొందరు గ్రూపులుగా ఏర్పడి గ్యాంగుల పేర్లు పెట్టుకుని విశాఖలో దందాలు, సెటిల్‌మెంట్లు చేస్తున్నారు. హైపర్ గ్యాంగ్ పేరుతో ఇటీవల కత్తులతో 8 మంది పోలీసులకు

 • టీడీపీ కీలక నేతకు సీఐడీ నోటీసులు -6న విచారణ..!!
  on October 1, 2022 at 10:17 am

  టీడీపీ కీలక నేతకు కు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. విశాఖ జిల్లా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ కు సీఐడీ అధికారులు ఈ నోటీసులు జారీ చేసారు. విజయ్ హైదరాబాద్ లోని ఇంట్లో ఉన్నారనే సమాచారంతో ఏపీ సీఐడీ అధికారులు అక్కడకు వెళ్లారు. ఇంట్లో విజయ్ లేకపోవటంతో, ఇంట్లో ఉన్న

 • రఘురామకు సుప్రీంకోర్టులో బిగ్ రిలీఫ్-సీబీఐ విచారణకు బ్రేక్..
  on October 1, 2022 at 10:14 am

  వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు ఇవాళ సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ విచారణ జరుపుతున్న ఓ కేసులో రఘురామకు ఈ ఊరట లభించింది. ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు కేసుల్లో పోరాటం చేస్తున్న రఘురామకు ఈ వ్యవహారంలో మాత్రం ఊరట దక్కింది. రఘురామరాజుకు చెందిన ఇండ్ భారత్ ధర్మల్ పవర్ లిమిటెడ్ సంస్ధ దివాళా తీసిందని ఆరోపిస్తూ

 • బెంజ్ కారు కొనేంత స్తోమత నాకు లేదు: నితిన్ గడ్కరీ
  on October 1, 2022 at 10:12 am

  తనకు బెంజ్ కారు కొనేంత స్తోమత లేదని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. పుణెలోని చకన్ తయారీ యూనిట్ లో ఇండియాలోనే అసెంబుల్ చేసిన EQS 580 4MATIC EVని గడ్కరీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బెంజ్ ఇండియాకు ఆయన ఒక సూచన చేశారు. భారత్ లో ఉత్పత్తులను పెంచాలన్నారు. విలాసవంతమైన కార్ల

 • దేశ భవిష్యత్ ను మార్చే యాత్ర.!రాహుల్ గాంధీ జోడో యాత్రను విజయవంతం చేస్తామన్న రేవంత్ రెడ్డి.!
  on October 1, 2022 at 9:52 am

  హైదరాబాద్: భారత్ జోడో యాత్ర దేశ భవిష్యత్తును మార్చే యాత్ర అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఆనాడు గాంధీ చేపట్టిన దండి యాత్రలా… భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు. చరిత్రలో ఒక కీలకమైన భారత్ జోడో యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప అవకాశమని తెలిపారు. హైదరాబాద్ మణికొండలోని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ నివాసంలో

 • గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి కేసులో సుప్రీంకోర్టుకు ‘మండింది’.. రోజువారీ విచార‌ణ‌కు ఆదేశాలు!
  on October 1, 2022 at 9:45 am

  మీరెందుకు స్వ‌రం పెంచుతున్నారు మేడం? దానివ‌ల్ల మీకు మేలు జ‌ర‌గ‌దు.. పైగా కోర్టులో అలా చేస్తే ఎవ‌రికీ ఉప‌యోగ‌ప‌డ‌దు.. మీరేం చెప్పాల‌నుకుంటున్నారో చెప్పండి.. మేం ప‌రిశీలిస్తాం.. అంతేకానీ గొంతు మాత్రం పెంచొద్దు అంటూ సుప్రీంకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎంఆర్‌షా గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి లాయ‌రు మీనాకీ అరోడాకు హెచ్చ‌రిక‌లు జారీచేశారు.

 • మీ పథకాలేవీ మాకొద్దు: ఎమ్మెల్యే కేతిరెడ్డి ముఖం మీదే తేల్చిచెప్పిన ఓ సామాన్య టీడీపీ కార్యకర్త
  on October 1, 2022 at 9:20 am

  పుట్టపర్తి: శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ధర్మవరం శాసన సభ్యుడు కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇదివరకు గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంతో రాష్ట్ర ప్రజలందరికీ చేరువ అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్

 • పొల్యూషన్ సర్టిఫికెట్ చూపిస్తేనే పెట్రోల్- అక్టోబర్ 25 నుంచి అమలు-ఎక్కడంటే…
  on October 1, 2022 at 9:14 am

  భారత్ లో కాలుష్యం అంతకంతకూ పెరుగుతోంది. దేశ రాజధాని ఢిల్లీ నుంచి మొదలుపెట్టి చిన్న చిన్న పట్టణాల్లో సైతం కాలుష్య భూతం ఆవరిస్తోంది. దీంతో ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోక తప్పని పరిస్ధితులు ఎదురవుతున్నాయి. దీంతో కాలుష్యం పరిమితులకు లోబడి ఉన్నట్లు ధృవపత్రం సమర్పిస్తేనే ఇకపై పెట్రోల్ పోసేలా నిబంధనల్ని సవరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య

 • మిషన్ భగీరథకు ఎలాంటి అవార్డు ఇవ్వలేదు.!కేంద్ర జలవనరుల శాఖ వివరణ.!
  on October 1, 2022 at 8:41 am

  ఢిల్లీ/హైదరాబాద్: దేశానికే గర్వకారణంగా రూపొందించిన మిషన్ భగీరథ పథకానికి జాతీయ అవార్డులు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉందని, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు దూరదృష్టికి ఇదే నిదర్శనమని మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్న అంశం తెలిసిందే. ఇదే అంశం పట్ల ఇప్పుడు రాజకీయ దుమారం చెలరేగుతోంది. అవార్డుకు సంబందించిన జాతీయ సంస్ధలు, ప్రభుత్వ శాఖలు